మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 5 : కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగిపోతేనే కాంగ్రెసోళ్లు గగ్గోలు పెడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. రెండు పిల్లర్లకు రెండు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ దీన్ని రాజకీయం చేసి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు.
మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పార్టీ నాయకులు వీక్షించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్‌రావు ప్రజంటేషన్‌తో ప్రజలందరికీ కాళేశ్వరంపై పూర్తి అవగాహన వచ్చిందని అన్నారు.