తెలంగాణ నీటిని అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక
తెలంగాణకు కేటాయించిన తుంగభద్ర జలాలను కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా తరలించుకుపోతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తాగునీటి పేరుతో మన వాటా నీటిని కర్ణాటక మళ్లిస్తున్నదని, దీనిపై రేవంత్‌రెడ్డి ప్రభు త్వం తక్షణమే స్పందించి రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడాలని డిమాం డ్ చేశారు. బోర్డు షెడ్యూల్ ప్రకారం.. నీటిని విడుదల చేసినా, పది రోజులు గడిచినా రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆయకట్టుకు నీరు చేరకపోవడంపై అనుమానాలు వ్యక్తంచేశారు.
- ఆర్డీఎస్ ఆయకట్టుకు పది రోజులైనా తుంగభద్ర నీరు చేరలేదు
- రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలం
- మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ మండిపాటు
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేటాయించిన తుంగభద్ర జలాలను కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా తరలించుకుపోతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తాగునీటి పేరుతో మన వాటా నీటిని కర్ణాటక మళ్లిస్తున్నదని, దీనిపై రేవంత్‌రెడ్డి ప్రభు త్వం తక్షణమే స్పందించి రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడాలని డిమాం డ్ చేశారు. బోర్డు షెడ్యూల్ ప్రకారం.. నీటిని విడుదల చేసినా, పది రోజులు గడిచినా రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆయకట్టుకు నీరు చేరకపోవడంపై అనుమానాలు వ్యక్తంచేశారు.
గతంలో 1,500 క్యూసెకులు విడుదల చేస్తే మూడు రోజుల్లోనే ఆర్డీఎస్కు చేరేవని, ఇప్పుడు వారం దాటినా రాకపోవడం ఆందోళనకరమని వాపోయారు. తెలంగాణకు రావాల్సిన నీటిని కర్ణాటక తమ ఎగువ ప్రాంతాల్లోనే మళ్లిస్తున్నదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తుంగభద్ర బోర్డు, రాష్ట్ర నీటిపారుదల శాఖ వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రతిరోజూ విడుదలవుతున్న నీటి పరిమాణం, వినియోగం, ఆర్డీఎస్కు వాస్తవంగా చేరుతున్న నీటి లెకలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వెంటనే ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపి, కర్ణాటక ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

