హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 70 వేల కోట్లతో డాటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే డాటా సెంటర్లతో సవాళ్లున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. వ్యవసాయ, గృహ వినియోగానికి కరెంట్ ఇచ్చిన తర్వాతే డాటా సెంటర్లకు సరఫరా చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నదని ప్రకటించారు.
ఆదిలాబాద్‌లో నిర్మించిన ఐటీ టవర్‌ను మూడు, నాలుగు రోజుల్లో ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు మధ్య స్వల్ప సంవాదం జరిగింది.