లండన్ : 2022 ఫిబ్రవరిలో మాస్కో పూర్తి స్థాయి దాడిని ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్లో ఐదు లక్షలకుపైగా రష్యా సైనికులు మృతి చెందారని బ్రిటన్ రక్షణ సిబ్బంది అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ సర్ రిచర్డ్ నైటన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధం, డ్రోన్ దాడులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ అంచనా ఉక్రెయిన్ సైన్యం వెల్లడించిన గణాంకాలతో సరిపోలి ఉంది.
అయితే రష్యా అధికారులు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రష్యా వద్ద సైన్యం ఉన్నప్పటికీ యుద్ధ భూమిలో ముందుకు సాగేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని నైటన్ విలేకరులతో అన్నారు.