హైదరాబాద్, జూన్ 16(నమస్తేతెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. సోమవారం మినిస్ట్రీ ఆఫ్ సిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రపెన్యూర్షిప్(గవర్నమెంట్ ఆఫ్ ఇండియా), డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(తెలంగాణ) సంయుక్తాధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని పీజీ లా కళాశాలలో ఏర్పాటు చేసిన ‘మెగా జాబ్/సిల్ అండ్ లోన్ మేళా’ను కేంద్రమంత్రి జయంత్ చౌదరితో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘యువత ప్రతిభే ఈ రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తి. కానీ.. చాలా మందిలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు ఉండటం లేదు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య నెలకొన్న అంతరాన్ని మా ప్రభుత్వం గుర్తించి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది..’ అని మంత్రి వివరించారు.