హైదరాబాద్, నవంబర్15 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమితులైన ఈ శ్రీధర్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం స్థా నంలో ప్రభుత్వం శ్రీధర్‌ను ఇటీవలే నియమించింది. సెక్రటరీ శ్రీధర్‌ను మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు, బీసీ సంక్షేమశాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎక్సైజ్ డైరెక్టర్‌గా హరికిరణ్ బాధ్యతలు
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రొహిబిష న్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా చెవ్వూరు హరికిరణ్ శుక్రవారం ఆబ్కారీ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సెక్రటేరియట్‌లోని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాద పూర్వకంగా కలిశారు. అడిషనల్ డైరెక్టర్ అజయ్‌రావు, జాయింట్ కమిషనర్లు ఖురే షి, కేఏబీ శాస్త్రి, సురేశ్, జాయింట్ క మిషనర్ శశిధర్‌రెడ్డి, బేవరీస్ కార్పొరేషన్ జీఎంలు అబ్రహం, కాశీనాథ్, డిప్యూటీ కమిషనర్ దశరథ్, డీసీ హెడ్ క్వార్టర్స్ రఘురాం, అసిస్టెంట్ కమిషనర్లు చంద్రయ్య, శీలం శ్రీనివాస్, అనికుమార్‌రెడ్డి, ఆర్ కిషన్, ప్రవీణ, శ్రీధర్, ఎస్టీఎఫ్ ప్రదీప్‌రావు, ఏఈఎస్‌లు శ్రీనివాసరావు, జీవన్‌కిరణ్, పీఏలు జాఫర్, రమేశ్ నూతన డైరెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 2009 ఐఏఎస్ ఏపీ నంబర్ వన్ ర్యాంకర్గానూ, ఆల్ ఇండియాలో 18వ ర్యాంకర్‌గా హరికిరణ్ గుర్తింపు పొందారు. శిక్షణ అనంతరం వైఎస్సార్ కడప, ఈస్ట్‌గోదావరి కలెక్టర్‌గా, అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్‌గా పనిచేశారు.