భద్రాచలం: దక్షిణాది అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి (Sri Rama Navami) బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏప్రి ల్ 2న ధ్వజపట లేఖనం, 3న గరుఢాదివాసం, 4న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 5న ఎదుర్కోలు, 6న నవమి సందర్భంగా సీతారామ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. అదేరోజు పునర్వసు దీక్ష ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం, 12న చక్రతీర్థం, శ్రీపుష్పయాగంతో ఉత్సవ సమాప్తి కానుంది.