హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య తన అధిపత్యాన్ని కొనసాగిస్తూ.. ఆల్టైమ్ రికార్డు నమోదుచేసినట్టు విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఆలిండియా మొదటి ర్యాంకుతో పాటు ఓపెన్ క్యాటగిరీలలో 4, 56, 9, 10, 12, 14 ర్యాంకులను విద్యార్థులు సాధించారని వెల్లడించారు.
తమ విద్యార్థి రాఘవశర్మ ఆలిండియా మొదటి ర్యాంకు, రిథమ్ కేడియా 4వ ర్యాంకు, పుట్టి కుశాల్కుమార్ 5వ ర్యాంకు, రాజదీప్ మిశ్రా 6వ ర్యాంకు, ధృవిన్ హేమంత్దోషి 9వ ర్యాంకు, ఏ ఎస్ఎస్డీబీ సద్ధిక్ సుహాస్ 10వ ర్యాంకు సాధించినట్టు వివరించారు. ఓపెన్ క్యాటగిరీలో టాప్ 10లోపు 5, వంద లోపు 30, వెయ్యిలోపు 202, వివిధ క్యాటగిరీల్లో 100లోపు 146, వెయ్యిలోపు 721 ర్యాంకులను కైవసం చేసుకొన్నట్టు తెలిపారు. మొత్తం తమ విద్యార్థులు 3,728 మంది క్వాలిఫై అయినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులను సుష్మ అభినందించారు.