హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ఎప్సెట్ -25 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో టాప్ ర్యాంకులతో నంబర్ వన్ స్థానంలో నిలిచి రికార్డులు సృష్టించిందని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుష్మ పేర్కొన్నారు.
ఇంజినీరింగ్లో టాప్ 10లోపు 6 ర్యాంకులు, టాప్ 100లోపు 50 ర్యాంకులు, అగ్రికల్చర్/ఫార్మా విభాగంలో టాప్ 10లోపు 7 ర్యాంకులు, టాప్ 20లోపు 17 ర్యాంకులు, టాప్ 100లోపు 70 ర్యాంకులు సాధించి తనకు పోటీ లేదని నిరూపించిందని తెలిపారు.