రైతన్న.. ఐడియా అదరహో!
అతడో సాధారణ రైతు.. తనకున్న ఎకరంలో పండిన పంటనే అతడికి జీవనాధారం.. ఆ ఎకరం సాగు చేసుకుందామంటే కూలీలు దొరకని పరిస్థితి.. పంటకు రసాయనాల పిచికారీ, ఎరువులు వేయడం ఖర్చుతో కూడుకునేది.
- ఎడ్లబండి సాయంతో పిచికారీ పరికరం
- 15 నిమిషాల్లోనే ఎకరా పంటకు స్ప్రే
- ఇంటింటా ఇన్నోవేటర్ రాష్ట్రస్థాయికి ఎంపిక
- రైతు మఖ్తుం అలీకి అభినందనల వెల్లువ
మహబూబ్‌నగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అతడో సాధారణ రైతు.. తనకున్న ఎకరంలో పండిన పంటనే అతడికి జీవనాధారం.. ఆ ఎకరం సాగు చేసుకుందామంటే కూలీలు దొరకని పరిస్థితి.. పంటకు రసాయనాల పిచికారీ, ఎరువులు వేయడం ఖర్చుతో కూడుకునేది. సాగులో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు తన ఆలోచనకు పదునుపెట్టాడు.
కూలీల అవసరం లేకుండా పొలంలో పెస్టిసైడ్తో పాటు ఎరువులను కేవలం ఒక వ్యక్తి సాయంతో పిచికారీ చేసే పరికరాన్ని రూపొందించాడు నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల గ్రామానికి చెందిన మఖ్తుం అలీ. రూ.50 వేల ఖర్చుతో ఒక ఎడ్లబండిలో 5 హెచ్‌పీ ఇంజిన్, స్ప్రే పంపు, బ్యాటరీ, డైనమో, రెండు వైపర్ మోటార్లు, రెండు డ్రమ్ములు, రెండు స్ప్రేయింగ్ గన్స్‌తో ఈ పరికరాన్ని రూపొందించాడు. స్ప్రే గన్స్ ఇంటింటా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యింది. ఈ యంత్రాన్ని రైతులే ఇంటి వద్ద తయారు చేసుకొనే టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఆ రైతును స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా అవార్డుతో సత్కరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- crop
- pichkari
- Spray
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

