హైదరాబాద్, జూలై24 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్, ఒకేషనల్ కాలేజీల్లోని ఖాళీల భర్తీకి 27న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి వర్షిణి బుధవారం ప్రకటన విడుదల చేశారు. బాలికలకు 26న, బాలురకు 27న స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని వెల్లడించారు. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని వెల్లడించారు.
26న బీఆర్క్ అడ్మిషన్ నోటిఫికేషన్
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): బీఆర్క్ కాలేజీలలో సీట్ల భర్తీకి 26న అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కమిటీ నిర్ణయించింది. 1 నుంచి 8 వరకు కౌన్సెలింగ్కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, స్కానింగ్ కొనసాగుతుందని బుధవారం బీఆర్క్ అడ్మిషన్ కన్వీనర్ సుకుమార్ తెలిపారు. వివరాలకు https://barchadm.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు.
వ్యాక్సిన్ వికటించి బాలుడి మృతి!
పెద్దశంకరంపేట, జూలై 24: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండకు చెందిన రాములు-మల్లేశ్వరి దంపతుల మూడు నెలల బాబు ధృవకు పెద్ద శంకరంపేట మండలం మల్కాపూర్ సబ్సెంటర్లో వ్యాక్సిన్ (పెంటా వాలెట్)ను వేయించారు. ఇంటికి వెళ్లిన తర్వాత బాలుడు అస్వస్థతకు గురికావడంతో పెద్దశంకరంపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకురాగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వ్యాక్సిన్ వికటించడంతోనే బాలుడు మృతి చెందాడని కుటుంబసభ్యులు, గ్రామస్థులు, బంధువులు ఆందోళనకు దిగారు.