DSC | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. అ న్ని జిల్లాల్లో కలిపి 90 వరకు స్పోర్ట్స్ కోటా పోస్టులున్నాయి. జీవో-74 ప్ర కారం అన్ని అర్హతలున్న 33 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారు. మిగిలిన పోస్టులను నాన్ స్పోర్ట్స్ కో టాలో జనరల్ అభ్యర్థులతో భర్తీచేశా రు. దీంతో చాలా మంది అభ్యర్థులు తమకు అన్ని రకాల అర్హతలున్నాయ ని, అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. కొంత మంది స్పో ర్ట్స్ సర్టిఫికెట్లపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ అధికారులకు ఫిర్యాదులుచేశారు. దీంతో అభ్యర్థులందరి సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించాలని వి ద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
ఇందులో భాగంగా 393 మంది స్పో ర్ట్స్ కోటా అభ్యర్థులకు 20 నుంచి 22 వరకు మరోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ దోమల్‌గూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సూచించారు. పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మినహా 31జిల్లాల్లోని పీఈటీ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ జిల్లాలో 20 మంది ఫలితాలు విత్‌హెల్డ్‌లో పెట్టారు.