సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 16:10:00

భూ సేకరణ పనులు వేగవంతం చేయండి : మంత్రి హరీశ్‌రావు

భూ సేకరణ పనులు వేగవంతం చేయండి : మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి : నేషనల్ హైవే-161 పనులు వేగవతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లాలో ఉన్న నాలుగు జాతీయ రహదారులపై విధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేషనల్ హైవే161-B నిర్మాణం కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎన్ హెచ్-65 పై భెల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించాలని నిర్మాణ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో 1447 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 116 రైతు వేదికలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో నియంత్రిత సాగు వంద శాతం విజయవంతమైందని మంత్రి తెలిపారు. కరోనా వల్ల రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి అత్యవసరమైతెనే బయటికి రావాలన్నారు.


logo