Special Train | కాచిగూడ, కాజీపేట మీదుగా రిషికేశ్కు ప్రత్యేక రైళ్లు..!
Special Train | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలోని కాచిగూడ, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. యశ్వంత్‌పూర్-యోగ్ నగరి రిషికేశ్ (06597)కు ప్రతి గురువారం రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
Special Train | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలోని కాచిగూడ, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. యశ్వంత్‌పూర్-యోగ్ నగరి రిషికేశ్ (06597)కు ప్రతి గురువారం రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ రైలు గురువారం ఉదయం 7గంటలకు రిషికేశ్‌లో బయలుదేరి ఆదివారం గమ్యస్థానం చేరుతుంది. ఈ రైలు కాచిగూడలో రాత్రి 8.50 గంటలకు.. కాజీపేటలో 11.33 గంటలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
రిషికేశ్-యశ్వంత్‌పూర్ (06598) రైలు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు రెండుమార్గాల్లో యెలహంక జంక్షన్, హిందుపూర్, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లర్షా, నాగ్‌పూర్, భోపాల్, బినా జంక్షన్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, మధుర, నిజాముద్దీన్, ఘజియాబాద్, మీరట్, ముజఫర్‌నగర్, తాప్రి, రూర్కీ, హరిద్వార్ స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది. ఈ రైలులో ఫస్ట్‌క్లాస్ ఏసీ, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

