హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): వేసవి కాలం దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేసవికాలంలో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు రైళ్ల ను నడిపించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే దసరా, సంక్రాంతి వంటి పండుగలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వసూ లు చేస్తున్నారు. వేసవిలో ప్రయాణికుల కోసం అదనపు రైళ్లు ఏర్పాటు చేయడం మంచిదే కాని, టికెట్లపై అదనపు చార్జీలు వసూలు చేయడం సమంజసం కాదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. కాగా, చర్లపల్లి, సికింద్రాబా ద్, కాచిగూడ, హైదరాబాద్, లింగంపల్లి స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతామని అధికారులు పేర్కొన్నారు.