నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో నిర్వహిస్తున్న నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షో మూడో రోజుకు చేరుకుంది. ఆదివారం కావడంతో సందర్శకులు ఉదయం నుంచే భారీగా తరలివస్తున్నారు. స్టార్లలో బ్యాటరీ వాహనాలు నడిపేందుకు యువతీ, యువకులు పోటీ పడుతున్నారు.
అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించిన కార్లు ప్రదర్శనలో ఉండడంతో నిజామాబాద్ నగర వాసులు విభిన్నమైన వాహనాలను తిలకించేందుకు పిల్లాపాపలతో ఆటో షో ను సందర్శిస్తున్నారు.
ఆటో షోను నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. నమస్తే తెలంగాణ ప్రయత్నాన్ని అభినందించారు. ఆయా బ్రాండ్లకు సంబంధించిన కార్లు, ద్విచక్ర వాహనాలు బుకింగ్ అవుతుండడంతో సందర్శనలో పాల్గొంటున్నా ఆటోమొబైల్ కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.