కీసరగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు
మేడ్చల్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు మేడ్చల్ జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.