హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో ఇతర వర్గాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో దివ్యాంగుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ యోచిస్తున్నది. త్వరలోనే 2,735 కొత్త బస్సులు వస్తాయని, అవసరమైతే దివ్యాంగుల కోసం స్పెషల్ బస్సు లు నడిపేలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ లో అనౌన్స్మెంట్, ఎంక్వయిరీ రూం ఉద్యోగా ల్లో అంధులకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.