రాయపర్తి, నవంబర్ 30: రెండేండ్ల కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలనే స్థానిక ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్ర్తాలుగా చేసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 40 గ్రామాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, బరిలో నిలిచిన అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు ఓట్లు వేయాలంటూ కోరాలని చెప్పారు. ప్రచారంలో ప్రణాళికలపై సూచనలు చేశారు.