Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లు, ఇతర జిల్లాల్లో తక్షణ అవసరాల కోసం రూ.కోటి చొప్పున ప్రభుత్వం ఆమోదించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి సీతక్క వెల్లడించారు.
Singur Drinking Water | హైదరాబాద్ : ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి సీతక్క తెలిపారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లు, ఇతర జిల్లాల్లో తక్షణ అవసరాల కోసం రూ.కోటి చొప్పున ప్రభుత్వం ఆమోదించిందని వెల్లడించారు. ఈ నిధులతో అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేసి, ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శనివారం ఉదయం మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాల్లో స్థానిక వనరులను వినియోగించుకోవడంతో పాటు, అవసరమైన చోట బోరుబావులను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
చేతిపంపులు, సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ నీటి సరఫరా పథకాలు, బావులు తదితర స్థానిక నీటి వనరులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మిషన్ భగీరథ సరఫరాలో అంతరాయం ఏర్పడే గ్రామాలు, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలను గుర్తించి, అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు.
నీటి పొదుపు, ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. ఇటీవల హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, యాదాద్రి సహా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. తాగునీటి వనరుల వద్ద ఇప్పటికే నిర్మించిన ఇంకుడు గుంతలు, మ్యాజిక్ పిట్లలో నీరు ఇంకేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పురోగతిలో ఉన్న నిర్మాణాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ విభాగాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Read Also :
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

