PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
PM Modi: జీఎల్ఎల్వీ-ఎఫ్18 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు ప్రధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు. ఆ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపారు.
న్యూఢిల్లీ: జీఎల్ఎల్వీ-ఎఫ్18 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు ప్రధాని మోదీ(PM Modi) కంగ్రాట్స్ తెలిపారు. ఆ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపారు. ఈ మిషన్ ద్వారా స్వదేశీ ఉపగ్రహా నావిగేషన్ సిస్టమ్ బలోపేతం కానున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే నావిగేషన్ సర్వీసులను ఎన్వీఎస్-03 అందిస్తుందన్నారు. టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధిస్తుందన్నారు. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తల పట్టుదల ఈ దేశాన్ని గర్వంగా నిలుపుతోందన్నారు.
నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-03ని శుక్రవారం అర్ధరాత్రి జీఎస్ఎల్వీ రాకెట్ విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. అర్ధరాత్రి 11:51 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(ఎస్డీఎస్సీ-షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లింది. 50 మీటర్ల ఎత్తు, మూడు దశలు కలిగిన ఈ రాకెట్ ప్రయోగ సమయంలో 420 టన్నుల బరువు ఉంది.
2,232 కిలోల బరువున్న ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోసిస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీవో)లో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ ను మరింత బలోపేతం చేయడంలో ఎన్వీఎస్-03 కీలక పాత్ర పోషించనుంది. ఈ ఉపగ్రహంలో స్వదేశీ, విదేశీ అణు గడియారాలు కూడా ఉన్నాయి.
Congratulations to our scientists and engineers at ISRO on the successful launch of GSLV-F18 carrying NVS-03.
This mission marks an important step in strengthening NavIC, our indigenous satellite navigation system. Equipped with enhanced capabilities, NVS-03 will further our pursuit of self-reliance in critical technologies and support navigation services that benefit our people.
The dedication and ingenuity of our space scientists continue to make our nation proud.
@isro
— Narendra Modi (@narendramodi) October 31, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

