నందిగామ, జూన్ 22 : టెక్స్టైల్స్ పార్కు పేరిట సేకరించిన భూములను తిరిగి తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో రైతులు ఆందోళనకు దిగారు. టెక్స్టైల్స్ పార్కు బోర్డు సభ్యులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.
నందిగామ మండలం చేగూరు రెవెన్యూ పరిధిలో 2003లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి కొందరు వ్యక్తులు చుట్టుపక్కల గ్రామాల రైతుల నుంచి సుమారు 140 ఎకరాల పట్టా భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశారు. భూములను సేకరించే సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడంతో భూములు ఇచ్చినట్టు బాధిత రైతులు పేర్కొంటున్నారు. ఏండ్లు గడిచినా టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటుచేయలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.