హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తేతెలంగాణ) : ఇంధన సామర్థ్యం, పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల నేపథ్యంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషీయన్సీ(బీఈఈ) దక్షిణ భారత మీడియా సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్కో ఎండీ అనీలతో కలిసి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు తోడ్పాటునిస్తున్న బీఈఈ, ఈఈఎస్ఎల్కు కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లో మార్థోమ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. క్రైస్తవుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని తెలియజేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని వెల్లడించారు. ఆ మేరకు సీఎం సందేశాన్ని క్రైస్తవులకు తెలియజేస్తున్నానని పొంగులేటి వివరించారు. క్రైస్తవులు విద్య, వైద్య రంగాల్లో నిస్వార్థ సేవలు అందిస్తున్నారని కొనియాడారు.