హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రత్యేక బస్సుల్లోనే మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నామని రవాణాశాఖ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. పండుగల వేళ సాధారణ చార్జీల కంటే గరిష్ఠంగా 1.5 రెట్లు అంటే 50 శాతం అదనంగా పెంచుకునే వెసులుబాటును 2003 నాటి జీవో నం.16 కల్పించిందని తెలిపింది.
పండుగల్లో ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులతో వెళ్లినప్పటికీ, తిరుగు ప్రయాణంలో మాత్రం ఖాళీగా రావాల్సి వస్తు న్నాయని వివరించింది. నిర్వహణ ఖర్చులను భర్తీ చేసేందుకు గరిష్ఠంగా 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్టు వెల్లడించింది.