మోఖి (చైనా): జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ మరోసారి ఫైనల్ చేరుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో 5-1 తో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. డ్రాగ్ ఫ్లికర్ సుప్రియ 17, 33, 56వ నిమిషాల్లో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
మదు సిదార్ (13వ ని), సుఖ్వీర్ కౌర్ (21వ ని) తలో గోల్ చేశారు. ఆదివారం జరిగే తుదిపోరులో ఆతిథ్య చైనాతో భారత్ తలపడనుంది.