హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మాజీ సర్పంచులకు 33 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం ఆర్థిక భారంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు తీర్చేందుకు అధిక వడ్డీలకు అప్పులు చేయడంతో ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయారని వాపోయారు.
ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుళ్లకోట మాజీ సర్పంచ్ సింహాచల జగన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జ్రగన్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని పేర్కొన్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు, మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.