హనుమకొండ చౌరస్తా, మే 18 : సరస్వతీ అంత్యపుషరాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు వరంగల్ రీజినల్ మేనేజర్ భవానీప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి, ప్రాణహిత, సరస్వ తీ నదుల సంగమస్థలమైన కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం వద్ద ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతీ అం త్యపుషరాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో హనుమకొండ-కాళేశ్వరం మార్గంలో భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, హనుమకొండ, వరంగల్-1, వరంగల్ -2 డిపోల ద్వారా మొత్తం 59 బస్సులు నడుస్తున్నాయని, పుషరాల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు వరంగల్ ఆర్ఎం భవానీప్రసాద్ తెలిపారు. ఆదిలాబాద్, కరీంనగర్ రీజియన్లు కూడా వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పా రు. రాష్ట్రవ్యాప్తంగా 3,360 బస్సులను వినియోగించి 5,772 ప్రత్యేక ట్రిప్పు లు నడిపేందుకు ప్రణాళిక రూపొందించినట్టు వెల్లడించారు.