హనుమకొండ, నవంబర్ 14: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిచెందిన మేడారం జాతరకు భక్తులందరూ సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులను సమర్పించుకునేందుకు ఆర్టీసీ వరంగల్ రీజియన్ నుంచి స్పెషల్ బస్సులను నడిపిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర సందర్భంగా వరంగల్ రీజియన్ భక్తుల సౌకర్యార్థం హనుమకొండ నుంచి మేడారంకు ప్రత్యేక బస్సులు ఈనెల 16(ఆదివారం) నుంచి నడపడం జరుగుతుందన్నారు.
ఉదయం 6 గంటల నుంచి భక్తుల రద్దీకనుగుణంగా మేడారంకు బస్సులు నడపబడుతుందని, మేడారం ప్రత్యేక బస్సుల ఆపరేషన్ నిర్వహణకు హనుమకొండ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు 24 గంటలు ప్రయాణికుల సేవలకు అందుబాటులో ఉంటారని, అన్ని ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులలో మహిళలకు, ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు. ఉచిత ప్రయాణానికి అనుమతించబడుతుందని కావున మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని సురక్షితంగా వారి మొక్కలను తీర్చుకోగలరని కోరారు.
మేడారం జాతరకు బస్సుల వివరాలు
హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి మేడారంకు బస్సులు బయలుదేరు సమయం: 6.10,7.00,8.00,9.00,12.10,13.00,13.40,14.30,20.20 మేడారం నుంచి హనుమకొండకు బస్సులు బయలుదేరు సమయం: 5.45,9.45,10.15,11.15,13.10,16.00,17.00,17.30,18.00 ఛార్జీల వివరాలు: పల్లె వెలుగు బస్సు ఛార్జీలు పెద్దలకు రూ.130, పిల్లలకు రూ.80, ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీలు పెద్దలకు రూ.180, పిల్లలకు రూ.110. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.