హైదరాబాద్ : పేద ప్రజలు కూడా పండుగలను సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రతియేట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్లోని సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని చర్చిల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
నియోజకవర్గ పరిధిలో ఉన్న చర్చిలు, గ్రేవ్ యార్డ్ ల అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా నూతన దుస్తులతో కూడిన గిఫ్ట్ ప్యాక్ లను, విందులను ఏర్పాటుచేసి అండగా ఉంటుందన్నారు.
ఉప్పల్ భాగాయత్ లో రెండు ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 కోట్లను మంజూరు చేసి, శంఖుస్థాపన చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ హేమలత, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, చర్చి కమిటీ ప్రతినిధులు ప్రశాంత్, చర్చిల పాదర్ లు ఎడ్వర్డ్ రాజన్, జయరాజ్, రామక్రిష్ణ, రవి కిరణ్, రాకేష్, టీఆర్ఎస్ డివిజన్ అద్యక్షులు ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.