అక్కడ ఏ1.. ఇక్కడ ఏ2 పాలన
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చే కుట్రలు పన్నుతున్నారని, అందుకు విభజన చట్టాన్ని సాకుగా తీసుకుంటున్నారని, రాష్ట్రం సిద్ధించి దశాబ్దమైనా ఇంకా పోరాడాల్సిన దుస్థితి వచ్చిందని, మళ్లీ కొట్లాటకు తెలంగాణ ప్రజలు సిద్ధం కావాల్సిన తరుణమిదని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు విమర్శలు గుప్పించారు.
- తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేందుకు చంద్రబాబు కుట్ర
- 18 మందిని పొట్టనబెట్టుకున్న వ్యక్తికి జైకొట్టడం సిగ్టుచేటు
- 42వేల మంది చెరుకు రైతుల పొట్టగొట్టిన ఘనత ఆయనది
- రైతు రుణమాఫీకి డబ్బుల్లేవుగానీ లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళనా?
- తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
ఖైరతాబాద్, జూలై 22: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చే కుట్రలు పన్నుతున్నారని, అందుకు విభజన చట్టాన్ని సాకుగా తీసుకుంటున్నారని, రాష్ట్రం సిద్ధించి దశాబ్దమైనా ఇంకా పోరాడాల్సిన దుస్థితి వచ్చిందని, మళ్లీ కొట్లాటకు తెలంగాణ ప్రజలు సిద్ధం కావాల్సిన తరుణమిదని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు విమర్శలు గుప్పించారు. తెలంగాణ విఠల్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రస్తుతం అక్కడ (ఆంధ్రప్రదేశ్)లో ఏ1.. ఇక్కడ (తెలంగాణ)లో ఏ2 పాలన సాగిస్తున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని కూకటివేళ్లలో అణచివేయాలని ప్రయత్నించిన వ్యక్తికి ఇక్కడి పాలకుడు భజన చేయడం దురదృష్టకరమని విమర్శించారు.
తెలంగాణ కోసం పోరాడిన బెల్లి లలిత, మారోజు వీరన్న తదితర 18 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తికి జై కొట్టడం సిగ్టుచేటని మండిపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సామాజికవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మేధావి అని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడంటూ పొగడమేమిటని ప్రశ్నించారు. భువనగిరిలో 18 మంది ఎలా చనిపోయారో ఇక్కడి ప్రజలకు తెలుసున్నారు. రూ.169 కోట్లకు నిజాం షుగర్స్ భూములను అమ్మేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, 42వేల మంది చెరుకు రైతుల పొట్టగొట్టారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో దొంగల పాలన కొనసాగుతున్నదని, అధిష్ఠానంలో ఉన్న సోనియాగాంధీ, రాహుల్, అధినాయకత్వం ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు.
‘ఉద్యమకారులకు ఏదైనా చేయాలని కోరితే ఏమైనా కేసులున్నాయా? అని అడుగుతున్నరు.. ఏం కేసులు కావాలి? ఏమైనా బ్రీఫ్‌కేస్‌లు కావాల్నా?’ అని పాశం ధ్వజమెత్తారు. నాడు చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడుతో కలిసి అర్ధరాత్రి పోలవరం ప్రాజెక్టు కోసం ఆర్డినెన్స్ తెచ్చుకున్నారని, ఏడు మండలాలను కోల్పోయి రెండు లక్షల మంది నిర్వాసితులయ్యారని, ఇప్పటికే పర్ణశాల, కల్యాణకట్ట, నవగ్రహాల ఆలయం మునిగిపోయాయని, మరో పది అడుగులు కడితే రామదాసు ఆలయం, ఇంకో పది అడుగులు కడితే పూర్తిగా భద్రాచలం పట్టణం, గర్భాలయం కూడా మునిగిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రూ.లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన ఎలా చేస్తావని సీఎం రేవంత్‌రెడ్డిని పాశం యాదగిరి ప్రశ్నించారు.
ఎవడబ్బసొత్తని భూమి ఇస్తరు?: గాదె ఇన్నయ్య
ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో ఏపీ భవనం కట్టుకోవడానికి భూమి ఇచ్చేందుకు నిర్ణయించారని, ఎవడబ్బసొత్తని భూమి ఇస్తారని తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ప్రశ్నించారు. విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్లు చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. పునర్విభజన చట్టంలోని అంశాలను తేల్చేందుకు కొత్తగా కమిటీలు వేశారని, కమిటీల పేరుతో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చేస్తారని ఎద్దేవాచేశారు.
స్థానిక ఎన్నికల్లో ఉద్యమకారులనే గెలిపించుకోవాలి : అరుణ
తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు గ్రామీణ స్థాయి నుంచి మరోసారి ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడిందని, పొంచి ఉన్న ముప్పు, జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ ప్రజలకు వివరించాలని తెలంగాణ ఉద్యమకారిణి అరుణ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులనే గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు సుశీలారెడ్డి మాట్లాడుతూ పదేండ్ల తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందని అనుకోలేదని, పదేండ్ల పాటు ఇటు కన్నెత్తి చూడని చంద్రబాబు మళ్లీ ఈ ప్రాంతంపై దృష్టిపెట్టారని, ఇటీవల హైదరాబాద్ నగరం పసుపుపచ్చగా మారడం వెనుక ఆ ప్రమాదాన్ని గుర్తించామని ఆందోళన వ్యక్తంచేశారు.
కృష్ణాజలాలపై నోరువిప్పని రేవంత్ : తెలంగాణ విఠల్
రౌండ్‌టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన తెలంగాణ విఠల్ మాట్లాడుతూ కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 75 శాతం పూర్తయిందని, ప్రభుత్వం మరో రూ.35వేల కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు సంపూర్ణమై 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుందని చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి రూ.1.50 లక్షల కోట్ల మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరపైకి తెచ్చారని, మూసీతో ఎన్ని ఎకరాలు పండిస్తారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని విఠల్ ప్రశ్నించారు. సమావేశంలో సీనియర్ అడ్వకేట్ చంద్రశేఖర్, నిఖిల్, షహబాజ్, కొండ స్వామి, దయాందన్, షాహిద్, గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణపై మళ్లీ వలసవాదుల కండ్లు : తుల ఉమ
తెలంగాణ వనరులను మనమే వాడుకోవాలన్న ఆకాంక్షతో సకలజనుల భాగస్వామ్యంతో ఉద్యమం చేసి స్వరాష్ట్రం సాధించుకున్నామని, అలాంటి తెలంగాణపై మరోసారి వలసవాదుల కండ్లు పడ్డాయని బీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమ మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ ఇక్కడ పాగా వేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు ఆయన ప్రసంగంలో తెలంగాణ మాట, తెలంగాణ నినాదమే వినపడలేదని ఇందుకు తాను చాలా బాధపడ్డానని చెప్పారు. తెలంగాణ వద్దని, తెలంగాణ ఎలా వస్తుందో చూస్తానని తుపాకీ అడ్డుపెట్టిన వ్యక్తి చేతిలో పాలన ఉంటే తెలంగాణ అస్థిత్వం ఎలా మనగలుతుందని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన పదేండ్లలో కనబడని చంద్రబాబు మళ్లీ ఈ ప్రాంతంపై దృష్టి పెట్టారని, ఇటీవల ఆయన పర్యటనలో హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఆయన బొమ్మలే కనిపించాయని చెప్పారు. ఆంధ్రా వ్యక్తులు ర్యాలీలు, గస్తీలు తిరుగుతూ మళ్లీ అడ్డా వేస్తామని నినదించడం దేనికి సంకేతమని? ప్రశ్నించారు. ఇందుకు చొరవ ఇచ్చిన ఆ శిష్యుడికే ఆ విషయం తెలియాలని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

