హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో శనివారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. స్పీకర్‌కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మరికొన్ని రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని డాక్టర్లు సూచించారు. ఈ నెల 24న స్పీకర్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
ఎటువంటి సమస్యలు లేకపోవడంతో పాటుగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో ఈరోజు హస్పిటల్ నుండి డిశ్చార్జి చేసిన డాక్టర్లు..
— Pocharam Srinivas Reddy (@PSRTRS) November 27, 2021
మరికొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండనున్న సభాపతి పోచారం గారు.