హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దక్కించుకున్నది. బీఆర్ఎస్ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శనివారం అసెంబ్లీలో ప్రకటించారు.
అసెంబ్లీలో 39 శానససభ్యులు ఉన్నందున, రెండో అతిపెద్ద పార్టీ అయినందున బీఆర్ఎస్ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పార్టీ సెక్రటరీ జనరల్ నుంచి అందిన లేఖ మేరకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ను గుర్తిస్తున్నామని తెలిపారు.