హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వాయిదా వేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరిగి సభ ప్రారంభంకానున్నట్టు శనివారం ప్రకటించారు.
సభ ప్రారంభం కాగానే విద్యుత్, మున్సిపల్, న్యాయ, అసెంబ్లీ, జీఏడీ, పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య పన్నులు, ఎైక్సెజ్, హోం, కార్మిక, ఉపాధి కల్పన, రవాణా, బీసీ సంక్షేమ, విద్య, వైద్య శాఖల పద్దులపై చర్చించనున్నారు.