హైదరాబాద్, జులై 31(నమస్తే తెలంగాణ) : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో తుది నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన పదవికి రాజీనామా చేసి న ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మాట్లాడిన మాటలు వింటే అప్పుడు అన్నీ మీకే తెలుస్తాయని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన స్పీకర్ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుపై మీ స్పందనేంటని విలేకరులు ప్రశ్నించగా ‘తీ ర్పు వచ్చిందని మీరు చెప్తేనే తెలిసింది. అది చదివిన తర్వాత ఏం వచ్చిందో పరిశీలించి న్యాయ నిపుణులతో సంప్రదించి అప్పుడు స మాధానం చెప్తా.
నేను ఇచ్చిన నోటీసులకు ఆ ఎమ్మెల్యేలు రిైప్లె కూడా ఇచ్చారు. సుప్రీం తీర్పు చదివిన తర్వాత అన్ని వివరాలు చెప్తా. ఇందులో దాచుకునేది ఏమీ లేదు’ అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు మూ డు నెలల గడువు పెట్టిందని చెప్పగా గతంలో రాష్ట్రపతికి వ్యవధి విషయంలో మాజీ ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్ మాటలను ఆధారంగా చేసుకొని స్పీకర్‌కు కూడా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయ లేవనే విధంగా పరోక్షంగా మాట్లాడినట్టుగా పలువురు చర్చించుకుంటున్నారు.