రామాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన స్పీకర్ పోచారం
నిజామాబాద్ : తన స్వగ్రామం బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న శ్రీ సీతారామాలయ నిర్మాణానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయం సతీసమేతంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..దేశ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. దేవాదాయ దర్మాధాయ శాఖ సహకారంతో రూ.50 లక్షలతో ఈ దేవాలయం నిర్మాణం జరుగుతుందన్నారు. ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

శ్రీరాముడు అందరికీ ఆదర్శం. రాముని సుగుణాలను అందరూ ఆచరించాలన్నారు. సీతమ్మ గొప్ప మహిళ. ఆలయం నిర్మాణం గొప్ప ఆశయం. స్వచ్ఛమైన మనస్సుతో పూజిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడన్నారు. భక్తి లేని పూజ వ్యర్థం. ప్రపంమంతటా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. యుద్దాలు, అశాంతి జరగకుండా అంతటా శాంతి ఉండాలి అని స్పీకర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

