SCR | హైదరాబాద్ : వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. చర్లపల్లి – విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మే 17న మధ్యాహ్నం 2 గంటలకు చర్లపల్లి నుంచి విశాఖపట్నంకు(07441) రైలు బయల్దేరనుంది. మే 18న రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి చర్లపల్లికి(07442) రైలు బయల్దేరనుంది. ఈ ప్రత్యేక రైళ్లలో 3ఏసీ, 3ఏసీ(ఎకానమీ) క్లాస్ కోచ్లు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.