SCR | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి 1 నుంచి నూతన రైల్వే టైంటేబుల్ అమల్లోకి తెస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో రైళ్ల సమయాలను ముందే పరిశీలించుకోవాలని ప్రయాణికులకు సూచించారు. వివరాలకు www.irctc.co.in , నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టం(ఎన్టీఈఎస్)వెబ్‌సైట్‌ను సందర్శించటంతోపాటు స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.