Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనున్నట్లు చెప్పింది. ఆదిలాబాద్-పండరీపూర్ (07613) రైలు అక్టోబర్ 31, నంబర్ 4వ తేదీల్లో నడుస్తుందని.. పండరీపూర్-ఆదిలాబాద్ (07614) రైలు నవంబర్ 1, 5 తేదీల్లో రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. ఈ రైలు బోధాడి బుజ్రుగ్, ధనోరా దక్కన్, సహస్రకుండ్, హిమాయత్‌నగర్, భోకర్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్భాని, గంగాఖేర్, పర్లి వైద్యనాథ్, పంగావ్, లాతూర్ రోడ్, లాతూర్, హారంగుల్, ఔసా రోడ్, ఢోకిరాడ్, పన్గావ్, ధోకిరాడ్, పన్గావ్లో ఆగుతుందని పేర్కొంది.
నాందేడ్-బీదర్ (07615) రైలు నవంబర్ 4న, బీదర్-నాందేడ్ (07616) రైలు నవంబర్ 6న రాకపోకలు సాగిస్తాయని చెప్పింది. ఈ రైలు పూర్ణ, పర్భని, గంగాఖేర్, పర్లి వైద్యనాథ్, లాతూర్ రోడ్, ఉద్గిర్, కమల్‌నగర్, భాల్కి స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది. విజయవాడ-యెలహంక (07411) రైలు నవంబర్ 22న, యెలహంక-విజయవాడ (07412) నవంబర్ 24న అందుబాటులో ఉంటుందని.. ఈ రైలు రెండుమార్గాల్లో గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్డు, కంబం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, ధోనే, గూటి, అనంతపురం, ధర్మవరం, సత్యసాయి నిలయం స్టేషన్లో ఆగుతాయని వివరించింది.
సికింద్రాబాద్-బెంగళూరు (07413) రైలు నవంబర్ 22న, బెంగళూరు-సికింద్రాబాద్ (07414) రైలు నవంబర్ 24న అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వేశాఖ పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, నవాంద్గి, సేడం, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి సాయి నిలయం స్టేషన్లలో ఆగుతాయని చెప్పింది. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఆయా రైళ్లను ఉపయోగించుకోవాలని కోరింది.