Special Trains | ఈ నెల 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా మొదలవనున్నది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది. మహా కుంభమేళాలో పాల్గొనాలనుకునే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కుంభమేళాకు అదనంగా 26 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తాయని చెప్పింది. గుంటూరు – ఆజంగఢ్ (07081), ఆజంగఢ్-విజయవాడ (07082), మచిలీపట్నం-ఆజంగఢ్ (07083), ఆజంగఢ్ -మచిలీపట్నం (07084), కాకినాడ-ఆజంగఢ్ (07085), ఆజంగఢ్-విజయవాడ (07086), మౌలాలి-బనారస్ (07087), బనారస్- మౌలాలి (07088), మౌలాలి-గయా (07089), గయా-మౌలాలి (07090) మధ్య రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అలాగే, వివిధ ప్రాంతాల మధ్య రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. గుంటూరు-ఆజంగఢ్-విజయవాడ (07081-07082) స్పెషల్ రైలు విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్, బల్లర్షా, చంద్రాపూర్, నాగ్పూర్, బేతుల్, ఇటార్సీ, పిపరియా, నర్సింగ్పూర్, జబల్పూర్, కట్ని, మైహర్, సత్న, మాణిక్పూర్, ప్రయాగ్రాజ్ ఛోకి జంక్షన్, మిరాజ్పూర్, వారణాసి, షాగంజ్ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Ttrains Details

Trains Details

Trains Details