హైదరాబాద్, మార్చి 5(నమస్తే తెలంగాణ) : కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను అభినందిస్తూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ లేఖ రాశారు. త్రివేణి సంగమం జలాలకు ఎంతో ప్రత్యేకత ఉన్నదని పేర్కొన్నారు.
హోంగార్డులను స్వరాష్ర్టానికి బదిలీ చేయాలి ; హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఏఐవైఎఫ్ విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 5(నమస్తేతెలంగాణ) : ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. బుధవారం హోంగార్డుల పక్షాన సచివాలయంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాకు ఏఐవైఎఫ్ బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేం ద్ర, వరింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్ మాట్లాడారు. 11 ఏండ్లుగా తెలంగాణ హోంగార్డులు ఏపీలో, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ హోంగార్డులు పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.