నిజాంపేట, ఆగస్టు9 : పింఛన్ డబ్బుల(Pension money) కోసం కన్నతల్లినే కొడుకు కడతేర్చిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట(Nizampet) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంపేటకు చెందిన రామచంద్రం గత కొన్ని ఏండ్లుగా మద్యానికి బానిపై డబ్బుల కోసం ఇంట్లో తరుచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి పింఛన్ డబ్బులు ఇవ్వాలని తల్లి దుర్గవ్వ(70)తో రామచంద్రం గొడువపడ్డాడు.
మద్యం మత్తులో చున్నీతో తల్లి మెడకు ఉరివేసి హత్య చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్, ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి చేరుకొని నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు కూతురు విజయ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.