పటాన్చెరు, డిసెంబర్ 12: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మామను అల్లుడు కత్తితో పొడిచి చంపండం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి బీరంగూడ కమాన్ సమీపంలో నివాసముండే చంద్రయ్య (58)ను అల్లుడు రామకృష్ణ కత్తితో పొడిచి హతమార్చాడు. రామకృష్ణకు భార్యకు మధ్య మనస్పార్ధలు రావడంతో గత మూడు నెలలుగా తల్లి గారి ఇంటి వద్ద భార్య ఉంటున్నది.
గురువారం సాయంత్రం చంద్రయ్య ఇంటికి రామకృష్ణ వచ్చి భార్యతో గొడవ పడుతుండగా చంద్రయ్య వారిని వారించాడు. ఆగ్రహానికి గురైన రామకృష్ణ అంతు చూస్తానని ఇంటికి వెళ్లి కత్తి తీసుకొని వచ్చి చంద్రయ్యను పొడిచి హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.