Telangana Tourism | కొల్లాపూర్, అక్టోబర్ 23: పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. క్రూయిజ్ టూర్‌ను ఈ నెల 26న ప్రారంభించనున్నట్టు బుధవారం తెలంగాణ టూరిజం శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌లో చేపట్టనున్న ఈ టూర్ ఆహ్లాదకరంగా ఉంటుందని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు సింగిల్ రైడ్‌తోపాటు రౌండప్ క్రూయిజ్ జర్నీ ధరలను కూడా ప్రకటించారు.
సింగిల్ జర్నీలో పెద్ద వాళ్లకు రూ.2 వేలు, చిన్నారులకు రూ.1,600, రౌండప్ జర్నీలో పెద్ద వాళ్లకు రూ.3 వేలు, పిల్లలకు రూ.2,400గా ధరను నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో లాంచీ ప్రయాణంతోపాటు టీ, స్నాక్స్ అందించనున్నట్టు చెప్పారు. సింగిల్ జర్నీకి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టనున్నది.