హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : సాగునీటి సంస్థలకు చెందిన ఖాళీ భూముల్లో భారీ ఎత్తున సౌర విద్యుత్తు (సోలార్) ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
సాగునీటి సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చి, వాటిని స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు కార్యాచరణపై ఆదివారం హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.