జగిత్యాల టౌన్, జూలై 1 : పొలంలో విత్తనాలు వేసే సమయంలో తన తండ్రి పడే కష్టాన్ని చూసిన ఆ యవకుడు విత్తనాలు నాటే యంత్రాన్ని ఆవిష్కరించి ఔరా అనిపించాడు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన రణధీర్ హెదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూలో ఎంటెక్ (మెకానికల్) చదువుతున్నాడు. తన తండ్రి పొలంలో విత్తనాలు నాటే సమయంలో పడుతున్న ఇబ్బందులను గమనించాడు.
తండ్రి కోసం విత్తనాలు నాటే యంత్రాన్ని తయారు చేయాలని ఆలోచించాడు. ఆర్అండ్డీ డైరెక్టర్ చెన్నకేశవరెడ్డి సూచన మేరకు సోలార్పవర్తో నడిచే ‘సీడ్ సోయింగ్’ మెషీన్ను తయారుచేశాడు. ఎంత దూరంలో విత్తనాలు వేయాలో దాంట్లో ఎంట్రీ చేసుకొనే అవకాశం కల్పించాడు.