హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): గుజరాత్ నుంచి తెలంగాణకు 200 మెగావాట్ల సౌర విద్యుత్తును అందించేలా నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ అంగీకరించింది. కచ్ జిల్లా బిబర్ లో ఎన్ఎల్సీ సంస్థ 510 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని రూ.1,214 కోట్లతో నిర్మిస్తున్నది. 2025 జూన్ నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభమ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ సోలార్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు గంటకు రూ.2.57/కిలోవాట్ చొప్పున విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది. వచ్చే 25 ఏండ్ల్లలో రూ.2 వేల కోట్లు రాష్ట్ర ట్రాన్స్‌కోకు ఆదా అవుతుందని అంచనా. ఈ సోలార్ ప్యానెళ్లతోపాటు పరికరాలను తెలంగాణ నుంచే కొంటారు.