సర్కారు హైస్కూళ్లలో సోలార్ వెలుగులు
సర్కారు బడులను విద్యుత్తు బిల్లుల భారం నుంచి బయటపడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 1,521 బడుల్లో సౌర విద్యుత్తును అమర్చగా, మరో 5,267 స్కూళ్లల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించింది.
- ఇప్పటికే 1,521 బడుల్లో సౌర విద్యుత్తు
- మరో 5,267 స్కూళ్లల్లో త్వరలో ప్లాంట్లు
- రూ.283 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం
- పాఠశాలలకు తప్పనున్న బిల్లుల భారం
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): సర్కారు బడులను విద్యుత్తు బిల్లుల భారం నుంచి బయటపడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 1,521 బడుల్లో సౌర విద్యుత్తును అమర్చగా, మరో 5,267 స్కూళ్లల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించింది. దీనికోసం రూ.283 కో ట్ల వ్యయం అవుతుందని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దీనికి ఆమోదం లభిస్తే మరో రెండు నెలల్లో రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలన్నింటిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటవుతాయి. 4,600 హైస్కూళ్లు, 475 కేజీబీవీలు, 192 మాడల్ స్కూళ్లల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి తరగతి గదికి లైట్లు, ఫ్యాన్లు ఉంటాయి. ఇటీవల పెద్ద ఎత్తున కంప్యూటర్ ల్యాబ్‌లను నెలకొల్పారు. డిజిటల్ విద్య కోసం ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను ఏర్పా టు చేశారు. దీంతో విద్యుత్తు వినియోగం అధికమై బిల్లులు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో బిల్లల భారం నుంచి బడులను బయట పడేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
అమలు ఇలా..
- ఇప్పటికే సోలార్ ఉన్న చోట 2 కేవీ నుంచి 5 కేవీ ప్లాంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తారు.
- నూతనంగా 4,600 ఉన్నత పాఠశాల్లో 5 కిలోవాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు.
- 192 రెసిడెన్షియల్ మాడల్ స్కూళ్లు, 475 కేబీజీవీలలో 10 కిలోవాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
- ఒక్కో కిలోవాట్‌కు రూ.80 వేల వరకు అంచనా వ్యయమవుతుంది.
సోలార్‌తో తొలగనున్న సర్కార్ స్కూళ్ల ఇబ్బందులు
మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా బడుల రూపురేఖలను మార్చేస్తున్నాం. 12 అంశాలను తీసుకొని అభివృద్ధి చేస్తున్నాం. 13వ అంశంగా సోలార్ విద్యుత్తు ప్లాంట్లను బడుల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 1,500కు పైగా బడుల్లో ఈ ప్లాంట్ల ఏర్పాటు పూర్తయ్యింది. ప్లాంట్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇదే తరహాలో మరికొన్నింటిలోనూ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం. వీటి ఏర్పాటుతో సర్కారు స్కూళ్ల ఇబ్బందులు తొలగిపోతున్నాయి. – సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

