హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): సీఎంఏ ఫౌండేషన్ పరీక్షలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారని సొసైటీ కార్యదర్శి వర్షిణి తెలిపారు. ఎంఈసీ, సీఈసీ విద్యార్థులు 74 మంది పరీక్ష రాయగా 39 మంది అర్హత సాధించారని వెల్లడించారు.
మూడేండ్ల సీఎంఏ పూర్తి చేసిన అనంతరం సీఏ కింద పనిచేసేందుకు అవకాశముంటుందని తెలిపారు.