Snakes | హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట మండలం కేంద్రంలోని ఓ సరస్సు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అక్కడ చేపలు పట్టేందుకు పలువురు స్థానికులు అక్కడికి వెళ్లారు. సరస్సు నుంచి నీరు బయటకు వచ్చే తూము వద్ద డజన్ల కొద్ది పాములు ప్రత్యక్షమయ్యాయి. ఆ పాములను చూసి స్థానికులు షాక్ అయ్యారు. చేపల వేటకు వస్తే పాములు భారీగా కనిపించడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక పాములకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ సెల్ఫోన్ కెమెరాల్లో బంధించి.. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియో చూస్తే ఒళ్లంతా జలదరించిపోక తప్పదు. ఆ పాములు కూడా నలుపు రంగులో ఉండి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.