Snake in Car | హైదరాబాద్ : పాము పేరు విన్నా.. కంటికి కనిపించినా హడలిపోతుంటాం. అలాంటి పాము మన కాళ్ల కిందే ఉంటే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అలాంటి ఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి జిల్లాకు చెందిన భూపాల్, అతని భార్య వివాహ వేడుక నిమిత్తం కారులో బయల్దేరారు. పెళ్లి ముగిశాక తిరిగి కారులోనే వస్తుండగా.. భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద భూపాల్ సడెన్ బ్రేక్ వేశాడు. ఎందుకంటే తన కాళ్ల కిందే పాము ఉన్నట్లు గమనించాడు భూపాల్. దీంతో అతని గుండె ఆగిపోయినంత పనైంది.
వెంటనే కారును ఆపిన భూపాల్.. స్నేక్ క్యాచర్కు సమాచారం అందించాడు. స్నేక్ క్యాచర్ పామును పట్టుకోవడంతో.. భూపాల్ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. పామును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.